పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రంలో క్రేజీ ఆఫర్ కొట్టేసి ఒక్కసారిగా ట్రెండ్ అయిన నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్రభాస్-మారుతి రాజా సాబ్ షూటింగ్ తో పాటుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. హరి హర వీరమల్లులో యువరాణి గా నిధి అగర్వాల్ లుక్ ఆమె బర్త్ డే స్పెషల్ గా వదిలారు మేకర్స్.
కానీ రాజా సాబ్ లో నిధి అగర్వాల్ ఎలా ఉంటుంది, ఆమె కేరెక్టర్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో ఆమె అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు. తాజాగా నిది అగర్వాల్ రాజా సాబ్ లుక్ లీకైంది. రాజా సాబ్ లో నిధి అగర్వాల్ ట్రెండీ గా గ్లామర్ లుక్ లో కనిపించేసరికి ఆమె అభిమానులు చాలా క్రేజీగా ఫీలవుతున్నారు.
రాజా సాబ్ లో నిధి అగర్వాల్ తో పాటుగా మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు హీరోయిన్స్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక రాజా సాబ్ టీజర్ ఈ క్రిష్టమస్ కి కానీ సంక్రాంతికి కానీ వదిలే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.