కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఆ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకోలేకుండా ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప 2తో 1500 కోట్లకు దగ్గరైన అల్లు అర్జున్.. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, జవాన్ ఇలా ఏ రికార్డ్ ను వదలకుండా తుడిచిపెట్టేసాడు. ఎన్నిసార్లు పార్టీ చేసుకున్నా తనివితీరని సక్సెస్ పుష్ప 2 సక్సెస్.
అల్లు అర్జున్ నవ్వినా, కూర్చున్నా, నించున్నా సంధ్య థియేటర్ ఘటన జ్ఞప్తికి వచ్చేలా చేసింది తెలంగాణ ప్రభుత్వం. పోనీ అయిందేదో అయ్యింది పార్టీ చేసుకుందామంటే.. ఓ మహిళ చావుకి కారణమయ్యావు, పిల్లాడు చావుబతుకుల్లో ఉంటే పార్టీ చేసుకుంటావా అంటారు, ఇప్పటికే పుష్ప ద రూల్ ప్రీమియర్స్ రెస్పాన్స్ చూసి ఆ నైట్ స్పెషల్ గా పార్టీ చేసుకున్న అల్లు అర్జున్, పుష్ప టీమ్ ని ఏకి పడేసారు నెటిజెన్స్.
ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ చూసాక పుష్ప టీమ్ అంతా ఏ అమెరికాకో వెళ్లి పార్టీ చేసుకుంటారు అనుకుంటే.. కిక్కురుమనకుండా ఎవరి ఇంటికి వాళ్ళే పరిమితమయ్యారు. జైలుకెళ్లోచ్చిన అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళితేనే జనాలు ఛీ కొట్టారు. అందుకే పార్టీ లేదు పుష్పా అంటూ కామ్ గా ఉన్నారు.
ఇంతటి విజయాన్ని స్నేహితులతో, సన్నిహితులతో కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిన అల్లు అర్జున్ సైలెంట్ అవడం చూసి సక్సెస్ ని కూడా తనివితీరా అనుభవించలేని హీరో బహుశా అల్లు అర్జునే ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.