మరో 20 రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వట్లేదు. అమెరికా లో గేమ్ ఛేంజర్ ఈవెంట్ అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో తెగ పబ్లిసిటీ చేస్తున్నా ఇక్కడి మెగా ఫ్యాన్స్ కి అది ఆనడం లేదు. హైదేరాబాద్ లో ఎలాంటి ఈవెంట్ ఆరెంజ్ చేస్తారో అని వారు ఎదురు చూస్తున్నారు.
అసలే పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప 2 ఈవెంట్ అప్పుడు తొక్కిసలాట జరగడం, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ వస్తుందా, అంత పెద్ద ఈవెంట్ జరగనిస్తారా అనే అనుమానం మెగా ఫ్యాన్స్ లో నడుస్తుంది. మరొపక్క గేమ్ ఛేంజర్ పాటలు చాట్ బస్టర్ అవ్వలేదు.
అదొక అసంతృప్తి.. జరగండి సాంగ్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, వినడానికి ఆ పాట అంత వినసొంపుగా లేదు, ఇవన్నీ మెగా అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. మరోపక్క శంకర్ సైడ్ నుంచి ఇండియన్ 2 ఎఫెక్ట్ ఉంది, అలాగే రాజమౌళి గండాన్ని రామ్ చరణ్ దాటుతాడా.. ఇలా రకరాల ఆలోచనలతో మెగా ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరి వీళ్ళ అనుమానాలు, ఆందోళనను పోగొట్టే ఒక్క అప్ డేట్ గేమ్ చెంజర్ నుంచి వస్తే మెగా ఫ్యాన్స్ కూలవుతారు. లేదంటే ఇలాంటి టెన్షన్లోనే కనిపిస్తారు.