నాగ చైతన్య-శోభితాల ప్రేమించి, ఇష్టపడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి ఎంగజ్మెంట్ కి ముందు ఎక్కడా వీరి డేటింగ్ పై ఫొటోస్ కానీ, వార్తలు కానీ లేవు, అప్పుడప్పుడు వీరి డేటింగ్ పై రూమర్స్ వినిపించినా వాటికి ఆధారాలు లేవు. కానీ ఎంగేజ్మెంట్ తోనే వీరి బంధానికి క్లారిటీ వచ్చింది.
అసలు వీరి ప్రయాణం ఎప్పుడు, ఎక్కడా, ఎలా మొదలయ్యింది అనే విషయంలో శోభిత తాజాగా చెప్పిన విషయం హైలెట్ అయ్యింది. అయితే శోభిత లో నాగ చైతన్యకి నచ్చనిది కూడా ఉందట. అదేమిటంటే..శోభిత నాగ చైతన్య ను 2022 నుంచే ఫాలో అవుతుందట. అంతేకాదు తాను ఇన్స్టాలో గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేస్తే లైక్ చెయ్యని చైతు.. మంచి విషయాలు ఏది పోస్ట్ చేసినా లైక్ చేస్తాడట.
అంటే శోభిత గ్లామర్ గా ఉండడం చైతు కి ఇష్టం లేదా, అందుకే ఆమె గ్లామర్ ఫొటోస్ ని చైతు సోషల్ మీడియాలో లైక్ చెయ్యడం లేదా అనే అనుమానం అందరిలో మొదలయ్యింది. ప్రొఫెషనల్ రీత్యా గ్లామర్ వాళ్ళ లైఫ్ లో భాగం. మరి శోభిత గ్లామర్ ని చైతు ఎలా తట్టుకుంటాడో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.