నాగ చైతన్య-శోభితలు ముంబై లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కార్యక్రమంలో పరిచయమై ప్రేమవరకు వెళ్ళామని, తర్వాత పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యామంటూ అటు చైతు, ఇటు శోభితలు చెప్పుకొచ్చారు. తాజాగా శోభిత-నాగ చైతన్య ల ప్రేమ ప్రయాణంపై, వారు ఎప్పుడు, ఎక్కడ కలిశామో అనే విషయాలపై శోభిత హాట్ కామెంట్స్ చేసింది.
2018 లో నేను నాగార్జున గారి ఇంటికెళ్ళాను, 2022 లో నాగ చైతన్యతో నాకు పరిచయమేర్పడింది. మేము మొదటిసారి ముంబైలో కలిసాము. నేను రెడ్ డ్రెస్ లో ఉన్నాను, 2022 నుంచే నేను చైతూని ఇన్స్టా లో ఫాలో అవుతున్నాను, మేము ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించి మట్లాడుకునేవాళ్ళం. నన్ను చైతు తెలుగులో మాట్లాడమని అడిగేవాడు. తనకి తెలుగు మాట్లాడేవారంటే ఇష్టమని చెప్పాడు.
అలా తెలుగులో మాట్లాడిన ప్రతిసారి మా బంధం మరింతగా బలపడింది. నేను ఇన్స్టా లో పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోస్ కాదు కానీ నేను పోస్ట్ చేసే స్ఫూర్తివంతమైన పోస్ట్ లను చైతు లైక్ చేసేవారు.
మేము పరిచయమైన సమయంలో నేను ముంబై, చైతు హైదరాబాద్ లో ఉండేవాళ్ళం, నన్ను కలిసేందుకు చైతు తరచూ ముంబై వచ్చేవారు. తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్ కి వెళ్ళాం, అక్కడ చాలాసేపు మట్లాడుకున్నాము, ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నాం. తర్వాత చైతు ఫ్యామిలీ నన్ను న్యూ ఇయర్ వేడుకల కోసం ఆహ్వానించారు, తర్వాత ఏడాది చైతు మా ఫ్యామిలీని కలిశారు.
గోవాలో మా పెళ్లి ప్రతిపాదన వచ్చింది, మా ఇద్దరి మనసులు కలిసాయి. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో కలిసినప్పటినుంచి అంతా మీకు తెలుసు అంటూ శోభిత చైతు తో ప్రేమ ప్రయాణం పై కామెంట్స్ చేసింది.