అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి మధ్యలో డిస్టెన్స్ ఏర్పడింది అనేది మీడియాలో వార్తలు మాత్రమేనా, లేదంటే నిజంగానే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నాడో తెలియదు కానీ.. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటినుంచి మెగా ఫ్యామిలిలో నాగబాబు అల్లు అర్జున్ పై ఆగ్రహంతో ఉన్నారనేది వాస్తవమే. అది అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వకముందు వరకు నిజమని జనాలు నమ్మారు కూడా. దానినే వైసీపీ వాడుకోవాలని చూసింది.
కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక స్టోరీ మొత్తం మారిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు ఇంటికి నాగబాబు వెళ్లారు, చిరు ఆయన భార్య వెళ్లారు, అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే పరామర్శల పరంపర తర్వాత ఆదివారం మెగాస్టార్ ఇంటికి సతీ సమేతంగా వెళ్లి భోజనం చేసి వచ్చాడు. పనిలో పనిగా నాగబాబు ఇంటికి వెళ్లి నాగబాబుతో భేటీ అయ్యాడు.
పవన్ ని కూడా వెళ్లి కలవబోతున్నాడనే వార్త వైరల్ అయ్యింది. అయితే ఇదంతా నిజమైన ప్రేమేనా అంటూ వైసీపీ బ్లూ మీడియా కథనాలు స్టార్ట్ చేసింది. చిరు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం, అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి, నాగబాబు ఇంటికి వెళ్ళింది ప్రేమతోనేనా అంటూ మాట్లాడుతున్నారు.
మరి ప్రేమలో అబద్దపు ప్రేమ, ఒరిజినల్ ప్రేమ ఉంటుంది నిజమే. సిట్యువేషన్ బట్టి మనిషి మారడమనేది సహజం. కానీ అల్లు అర్జున్ విషయంలో ఇలా గుచ్చి గుచ్చి ప్రేమలో ఒరిజినాలిటీ వెతుకుంది బ్లూ మీడియా ఎందుకో తెలుసా ప్రస్తుతం అల్లు అర్జున్-మెగా కలయికను వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది, అందుకే ఇలాంటి కామెంట్స్ చేసేది. అదండీ విషయం.