Advertisement
Google Ads BL

మీడియా ముందు తలెత్తలేని షణ్ముఖ్


ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకసారి కారు యాక్సిడెంట్ లో మీడియా లో హైలెట్ అవగా.. బిగ్ బాస్ సీజన్ 6 లో షణ్ముఖ్ సిరితో చేసిన స్నేహం అతని ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికి తెలుసు.

Advertisement
CJ Advs

షణ్ముఖ్ సోదరుడిని ఓ యువతి ప్రేమ కేసు విషయంలో విచారించడానికి వెళ్లిన నార్సింగి పోలీసులకు గంజాయితో షణ్ముఖ్ దొరకడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంట్లో గంజాయి దొరకడంతో షణ్ముఖ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచి సైలెంట్ గా కనిపించిన షణ్ముఖ్ ఇప్పుడు లీల వినోదం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈచిత్రం ఈటివి విన్ లో నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ ఈవెంట్ లో షణ్ముఖ్ జస్వంత్ మీడియాతో మాట్లాడేందుకు తడబడ్డాడు, అసలు తల ఎత్తలేకుండా మాట్లాడాడు. ఎవరో చేసిన తప్పుకి బలయ్యాను.. అమ్మానాన్నలను బాధపెట్టాను, వాళ్ళకి సారీ చెబుతున్నాను, ఏడాదిన్నరగా మీకు కంటెంట్ ఇవ్వలేదు, లీలా వినోదంతో మిమ్మల్ని మెప్పిస్తాను అంటూ తలపైకి ఎత్తకుంగానే మీడియా ముందు షణ్ముఖ్ మాట్లాడిన వీడియోస్ వైరల్ అయ్యాయి. 

Shanmukh who cant appear in front of the media:

Shanmukh Jaswanth Outburst
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs