పుష్ప ద రూల్ చిత్రం డిసెంబర్ 4 సాయంత్రం ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ రెండోవారంలోను దున్నేస్తుంది. ఇప్పటికి థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న పుష్ప ద రూల్ ఇండియా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తున్నది.. ఇప్పటివరకు నాన్ బాహుబలి రికార్డ్స్ అనేవారు, ఇకపై నా పుష్ప ద రూల్ రికార్డ్స్ అనేలా ఉంది వ్యవహారం.
రెండు వారాలు తిరక్కుండానే 1400 కోట్ల క్లబ్బులో అలవోకగా కాలుపెట్టిన పుష్ప ద రూల్ చిత్రం ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు. థియేటర్లులో బ్లాక్ బస్టర్ అవడంతో పుష్ప ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వస్తున్న విషయం తెలిసిందే.
నెట్ ఫ్లిక్స్ పుష్ప ద రూల్ చిత్రాన్ని ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత పుష్ప ద రూల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా లేదంటే ఎనిమిదివారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందా అనే విషయంలో సస్పెన్స్ నడుస్తుండగా.. జనవరి 9 న నెట్ ఫ్లిక్స్ నుంచి పుష్ప ద రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ అనే ఫేక్ పోస్టర్ వైరల్ అయ్యింది.
ఆ ఫేక్ పోస్టర్ పై పుష్ప టీమ్ వెంటనే స్పందించి.. అది ఫేక్ న్యూస్, పుష్ప 2 అప్పుడే ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ లేదు అని తెలిపింది.