టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు రాచకొండ కమిషనర్సుధీర్ బాబు డెడ్ లైన్ విధించారు. ఆయన అరెస్ట్, లైసెన్సు గన్స్ సరెండర్ విషయాల్లో పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది. ఆయనకు నోటీసులు జారీ చేశాం. ఈనెల 24 వరకు టైమ్ అడిగారు. హైకోర్టు కూడా ఈ నెల 24 వరకు ఆయనకు సమయం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం. అప్పటివరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని సీపీ వెల్లడించారు.
ఆలస్యమే లేదు..
మోహన్‌బాబు, మనోజ్ వివాదంలో 3 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాం. మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. మోహన్‌బాబు దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చాం. మోహన్ బాబు దగ్గర డబుల్ బ్యారెల్, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉంది. మోహన్‌బాబుకు మరోసారి నోటీసులు ఇస్తాం. నోటీసులకు స్పందించకపోతే తప్పకుండా అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ స్పష్టం చేశారు.
గన్స్ కథేంటి?
రాచకొండ కమిషనర్ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు మా వద్ద సమాచారం ఉంది. మోహన్ బాబు తన వద్ద ఉన్న రెండు గన్స్ ఎక్కడైనా డిపాజిట్ చేయొచ్చని నోటీసులు ఇచ్చాము. మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు మోహన్ బాబు తన వద్ద ఉన్న ఒక ఆయుధాలను డిపాజిట్ చేశాడు. మరో గన్ జలపల్లిలోని నివాసంలో ఉండడంతో తన బయోమెట్రిక్ ద్వారానే లాకర్ ఓపెన్ అవుతుందని ఆ గన్ తర్వాత డిపాజిట్ చేస్తానని చెప్పారని మోహన్ బాబు వివరించారు. ఇదిలా ఉంటే మోహన్ బాబుకు సంబంధించిన గన్ ఈ నెల 13న తిరుపతిలో పీఎ సతీష సరెండర్ చేయడం జరిగింది.
అటు కేసులు!
మరోవైపు.. మోహన్‌బాబు పీఆర్వో సహా బౌన్సర్లు ఆరుగురికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈనెల 9న మోహన్‌బాబు యూనివర్సిటీలో కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడిలో గాయపడిన రిపోర్టర్లు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన మంచు ఫ్యామిలీలో గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్న జనరేటరులో చక్కెరతో కలిపిన డీజిల్ పోశారంటూ మనోజ్ మీడియాకు వెల్లడించాడు. దీంతో నిన్న మొన్నటి వరకూ మంటలు చల్లారినట్టు అనిపించినా చక్కెరతో మళ్ళీ మొదలయ్యాయి.