రాజమౌళి-మహేష్ కాంబో చిత్రం పై గత నాలుగు నెలలుగా మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు చాలామందే ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి మహేష్ మూవీ అప్ డేట్ ఇవ్వకుండా ఇంకా ఇంకా సస్పెన్స్ లోనే పెడుతున్నారు. ప్రస్తుతం కీరవాణి కొడుకు శ్రీసింహ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న రాజమౌళి త్వరలోనే మహెష్ మూవీ పైకి రాబోతున్నారు.
అయితే ఈ చిత్రం అంటే SSMB 29 జనవరి లో సంక్రాతి వెళ్ళాక మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం జనవరి ద్వితీయార్ధం నుంచి రాజమౌళి మూవీ షూటింగ్ నిమిత్తం మహేష్ డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే వేసిన స్పెషల్ సెట్ లో మొదటి షెడ్యూల్ ని రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారట.
సినిమా ఓపెనింగ్ రోజునే కాన్సెప్ట్ వీడియోతో రాజమౌళి-మహేష్ మూవీపై అసలు సిసలు అప్ డేట్ ఇచ్చేందుకు రాజమౌళి అన్నిఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే మహేష్ తో టెస్ట్ షూట్ ఫినిష్ చేసిన రాజమౌళి మహేష్ లుక్ ఫైనల్ చేసారని, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.