టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళిలోని మరో కోణాన్ని చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అదేనండి మన పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనే కాదు డాన్స్ ల్లోనూ దుమ్మురేపడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన అన్న కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ సంగీత్ వేడుకల్లో రాజమౌళి భార్య రమ తో కలిసి స్టేజి మీద డాన్స్ చేసారు.
అదే వైరల్ అయ్యింది అనుకుంటే పెళ్లి లోను రాజమౌళి దేవర పాటకు వేసిన స్టెప్స్ మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసింది. మురళి మోహన్ మనవరాలు రాగ తో శ్రీసింహ పెళ్లి దుబాయ్ లో రెండురోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వీడియోస్ వైరల్ గా మారాయి.
రాగ ను పల్లకిలో మోస్తూ రాజమౌళి కొడుకు కార్తికేయ, కీరవాణి పెద్దకొడుకు కాల భైరవ కనిపించగా.. తర్వాత అమ్మాయిని తీసుకొస్తూ కాలభైరవ, రాజమౌళి డాన్స్ చెయ్యడం, మురళి మోహన్ కూడా స్టెప్స్ వేయడం, ఆతర్వాత పెళ్ళిలో రాజమౌళి, కాల భైరవలు దేవర చిత్రంలోని జరుపుకోవాలి జాతర వీరాధివీరుల కథ పాటకు డాన్స్ చించేసిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే హడావిడి చేస్తున్నాయి.