ఒకేరోజు మెగా అభిమానులను సర్ ప్రైజ్ చేసారు రామ్ చరణ్ నటిస్తున్న సినిమా అప్ డేట్స్ తో. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చెంజర్ పై రామ్ చరణ్ ఆదివారం రాత్రి ఇచ్చిన అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చరణ్ నిన్న బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ పై ఆయన శంకర్ తో అవకాశం రావడమే తనకు షాక్ అని, ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఏమిటా అని ఆలోచిస్తున్న టైమ్ లో ఆయన ఫోన్ రావడం, కథ వినకుండానే సినిమాకి కమిట్ అయ్యాను.
శంకర్ లాంటి దర్శకుడితో సినిమా చెయ్యడమే అదృష్టమని చెప్పారు. అలాగే ఆయన ఇబ్బంది పెట్టినా సినిమా అవుట్ ఫుట్ మాత్రం వేరే లెవల్, ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై హైప్ క్రియేట్ చేసారు. ఇక అదే రోజు సాయంత్రం ఆయనతో వర్క్ చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు కూడా RC 16 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
ఉపేంద్ర నటించిన UI మూవీ ఈవెంట్ లో బుచ్చిబాబు రామ్ చరణ్ RC 16 సెట్స్ లో దున్నేస్తున్నారని, ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నాను, చరణ్ చితక్కొడుతున్నాడని బుచ్చిబాబు చెప్పిన మాటలు స్ప్రెడ్ అవడంతో ఒకేసారోజు రామ్ చరణ్ మూవీస్ నుంచి రెండు అప్ డేట్స్ రావడం మెగా అభిమానులను ఉత్సహపరిచింది.