తెలుగోళ్లు తెలుగోడికి అన్యాయం చేసారా, లేదంటే తెలుగోళ్లు న్యాయం చేసినా కావాలనే బిగ్ బాస్ యాజమాన్యం కన్నడ నటుడిని గెలిపించిందా.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ పై ఇదే విస్తృతంగా జరుగుతున్న చర్చ. నిన్న ఆదివారం జరిగిన బిగ్ బాస్8 గ్రాండ్ ఫైనల్ లో గౌతమ్ విన్నర్ అంటూ అనధికారికంగా ఉన్న ఓటింగ్ పోల్స్ చెప్పాయి.
కానీ చివరికి కన్నడ యాక్టర్ నిఖిల్ కి బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ కప్ వచ్చింది. తెలుగోడిని గెలిపించాలనే కసితో గౌతమ్ కి తెలుగు ప్రేక్షకులు బాగానే ఓట్లు గుద్దారు. కానీ ఫైనల్ గా నిఖిల్ ని అదృష్టం వరించింది. అయితే గౌతమ్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ శాపమైందా అనే టాక్ కూడా నడుస్తుంది.
నిఖిల్ మొదటిరోజు నుంచే హౌస్ లో ఉన్నాడు, టాస్క్ ల పరంగా సూపర్బ్ ఆటతీరు కనబరచాడు. కానీ అమ్మాయిల విషయంలో నిఖిల్ ని చాలామంది బ్లేమ్ చేసారు. ముందు సోనియా ఆతర్వాత యష్మి విషయంలో నిఖిల్ ప్రవర్తించిన తీరుకు ప్రేక్షకులు హర్ట్ అయ్యారు. నిఖిల్ ఏదో తప్పు చేసాడు అని కాదు గాని.. ఆ ఇద్దరు అమ్మాయిల విషయంలో నిఖిల్ ప్రవర్తన ప్రేక్షకులకు నచ్చలేదు.
అందుకే నిఖిల్ కి ఓటింగ్ చెయ్యలేదు. ఈసారి ఎలాగైనా తెలుగోడికి టైటిల్ కట్టబెట్టాలని చూసినా అది అవ్వలేదు. గౌతమ్ కూడా చివరివరకు టైటిల్ గెలుస్తాను అనుకున్నాడు. కానీ చివరిలో నిఖిల్ చేతికి కప్పు రావడం చూసి గౌతమ్ కూడా డిజప్పాయింట్ అయ్యాడు. రామ్ చరణ్ దగ్గరకు పిలిచినపుడు గౌతమ్ మొహం మాడిపోయింది. అది చూసి అందరూ పాపం గౌతమ్ అనుకుంటున్నారు.