బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రావడమే కాదు చరణ్ చేతుల మీదుగా విన్నర్ ని ప్రకటించారు. 105 రోజుల నిరీక్షణకు ఈరోజు ఆదివారం ఎండ్ కార్డు పడింది. టాప్ 5 నుంచి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయ్యారు. ముందుగా అవినాష్ ను UI హీరో ఉపేంద్ర హౌస్ లోకి వెళ్లి టాప్ 5 నుంచి ఎలిమినేట్ చేసి తీసుకొచ్చారు.
ఆతర్వాత ప్రగ్య జైస్వాల్ హౌస్ లోకి అడుగుపెట్టి ప్రేరణ ని టాప్ 4 నుంచి ఎలిమినేట్ చేసి తీసుకొచ్చింది. ఆతర్వాత నబీల్ ని
విడుదల హీరో విజయ్ సేతుపతి-హీరోయిన్ మంజు లు టాప్ 3 నుంచి ఎలిమినేట్ చేసి తీసుకొచ్చారు. ఇక టాప్ 2 లో ఉన్న గౌతమ్-నిఖిల్ లలో ఎవరు విన్నర్ అవుతారా అని గ్యాలరీలో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఆతృతగా ఎదురు చూసారు. అయితే గతంలోలా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ విషయంలో బాగానే సస్పెన్స్ నడిచింది.
ఓటింగ్ పరంగా హవా చూపించిన గౌతమ్ విన్నర్ అవుతాడా.. లేదంటే అందరూ అనుకున్నట్టుగా బిగ్ బాస్ యాజమాన్యం నిఖిల్ ని విన్నర్ ను చేస్తుందా.. రామ్ చరణ్ చేతుల మీదుగా ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నారా అని అందరూ క్యూరియాసిటీతో కనిపించారు. టాప్ 2 లో ఉన్న నిఖిల్-గౌతమ్ లలో గౌతమ్ కి ఎక్కువ క్రేజే ఉంది.
కానీ అతను నెల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అతనికి మైనస్ అయ్యింది. మొదటినుంచి టాస్క్ ల పరంగా బెస్ట్ అనిపించుకున్న నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచి రామ్ చరణ్ చేతుల మీదుగా 55 లక్షల ప్రైజ్ మనీ తో పాటుగా బిగ్ బాస్ 8 ట్రోఫి అందుకున్నాడు.