మహానటి కీర్తి సురేష్ ఈ నెల 12న గోవాలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని ప్రేమ వివాహం చేసుకుంది. పక్కా హిందూ సాంప్రదాయం లో జరిగిన కీర్తి సురేష్-ఆంటోనీల వివాహంలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. చక్కటి చీరకట్టులో కీర్తి సురేష్ పెళ్లి కుమార్తె గా మెరిసిపోవడమే కాదు ఆంటోని తన మెడలో తాళి కడుతున్న సందర్భంలో ఎమోషనల్ అయిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇక ఈరోజు అంటే డిసెంబర్ 15 న కీర్తి సురేష్ మరోసారి ఆంటోనీని క్రిష్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకుంది. ఆంటోని-కీర్తి సురేష్ లు క్రిష్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి క్రిష్టియన్ సాంప్రదాయం అంటే వైట్ పెళ్లి గౌనులో కీర్తి సురేష్ మెరిసిపోగా ఆంటోని కూడా తెల్లటి డ్రెస్ తో కనిపించాడు .
రెండో పెళ్లిని క్రిష్టియన్ సాంప్రదాయం లో చేసుకున్న కీర్తి సురేష్ తన భర్త ఆంటోనికి లిప్ లాక్ పెడుతూ ఉన్న పిక్, అలాగే తండ్రి తనని తీసుకొస్తున్న పిక్, ఆంటోనీతో ప్రేమలో ఉన్న విషయాన్నిమొదటిసారి అనౌన్స్ చేసిన పిక్ లాంటి ఫొటోస్ ని షేర్ చేస్తూ తన వివాహ విషయాలను పంచుకుంది.