ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీస్ పై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. నేషనల్ అవార్డు విన్ అయినప్పుడు కూడా అల్లు అర్జున్ ని కలిసి అప్రిషేట్ చేయడానికి రాని సినీ సెలబ్రిటీస్, ఒక్కరోజు జైలులో గడిపి వస్తేనే.. ఏదో ఇండియా-పాక్ యుద్ధం చేసినట్టుగా ఫీలైపోయి ఆయన్ని పలకరించడానికి అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒకరు చనిపోయి మరో కుర్రాడు అత్యవసర చికిత్స పొందుతుంటే ఒక్కరు కూడా పలకరించిన పాపాన కాదు కనీసం జాలి చూపిస్తూ ట్వీట్ కూడా వెయ్యని వారు ఒక హీరో జైలుకెళ్లి వస్తే అతని పై సానుభూతి చూపిస్తూ ఇంటికెళ్ళి పరామర్శించడం పై పలు విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటివి చేసి సినీ ప్రముఖులు వాళ్ళ అభిమానులకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. జైలుకెళ్లోస్తే అతనేదో సాధించేసినట్టుగా అతన్ని పలకరించేందుకు ప్రముఖులు పోటీపడ్డారు. వెంకటేష్ నుంచి నాగ చైతన్య వరకు, అడవి శేష్ నుంచి సుడిగాలి సుధీర్ వరకు అందరూ అల్లు అర్జున్ ఇంటికి పరిగెత్తారు.
ఏదో దర్శకులు వెళ్లారంటే అల్లు అర్జున్ ని ప్రసన్నం చేసుకుని ఆఫర్స్ కోసం, అవకాశాలు ఎక్స్ పెక్ట్ చేసి అల్లు అర్జున్ ని కలిశారు, కానీ హీరోలకేమైంది.. ఇప్పుడదే హాట్ టాపిక్.