మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెడుతుంది అందుకే అల్లు అర్జున్ వైసీపీ తో కలిసిపోయి మావాడి కోసం ఎన్నికల్లో ప్రచారం చేసాడు, అల్లు అర్జున్ మావాడే. జనసేన, పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ను అడ్డం పెట్టుకుని, అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ సాధిస్తుంది అనడమే కాదు, అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు అటూ వైసీపీ గోల చేసింది.
అల్లు అర్జున్ అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ వారే అరెస్ట్ అయినట్లుగా ఆ పార్టీ నేతలు ట్వీట్లు పెట్టారు. అల్లు అర్జున్ విడుదలయ్యింది జగన్ వల్లే, జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ ని విడిపించారంటూ పొంగి పోవడమే కాదు, అల్లు అర్జున్-మెగా ఫ్యామిలీ మధ్యలో గ్యాప్ ని తాము వాడుకోవాలని చూసారు.
ఇప్పడు ఏం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ తో మెగా-అల్లు ఫ్యామిలీ బంధాన్ని మరోసారి నిరూపించాయి. మెగా ఫ్యామిలీ అందులోను నాగబాబు కూడా అల్లు అర్జున్ గుమ్మం ఎక్కాడు, ఇక ఈరోజు అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి లంచ్ చేసాడు. ఓ గంట మెయ్య ఇంట్లో గడిపి ఆ సందర్భంగా అల్లు అర్జున్ మావయ్య చిరు తో దిగిన పిక్ చూస్తే ఈరోజు వైసీపీ కి నిద్ర పట్టదేమో.
మెగాస్టార్ తో అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ దిగిన పిక్ చూసి పీక్ ఆఫ్ ది డే అంటూ అందరూ కామెంట్స్ చేస్తుంటే వైసీపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లుగా అయ్యుంటుంది అంటూ కామెడీగా నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.