అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య-అక్కినేని అఖిల్ తో ఒకేసారి రొమాన్స్ చేసే అవకాశం రావడం ఓ హీరోయిన్ కి చాలా అరుదుగా దొరుకుతుంది. గతంలో నిధి అగర్వాల్.. నాగ చైతన్య తో సవ్యసాచి లోను, అఖిల్ తో మజ్ను చిత్రంలోను నటించింది. ఇప్పుడు అలాంటి అరుదైన ఆఫర్ ని బ్యూటిఫుల్ శ్రీలీల అందుకుంది అని సమాచారం.
ఇప్పటికే నాగ చైతన్య కార్తీక్ దండు చిత్రంలో నాగ చైతన్య కి జోడిగా శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేశారనే టాక్ కాదు ఆల్మోస్ట్ నాగ చైతన్య తో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అంటుంటే.. తాజాగా అఖిల్ సరసన కూడా ఈ క్యూట్ బ్యూటీ శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది అనే టాక్ మొదలైంది. ఏజెంట్ తర్వాత అఖిల్ ఇంకా కొత్త సినిమా ప్రకటించలేదు.
అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ధీర చిత్రంతో పాటుగా వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర దర్శకుడితో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మరో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలోనే అఖిల్ తో శ్రీలీల రొమాన్స్ చేయబోతుంది అంటున్నారు. అలా అక్కినేని బ్రదర్స్ తో ఒకేసారి శ్రీలీల రొమాన్స్ చేస్తూ క్రేజీగా మారబోతుంది.