రెండు రోజులుగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో మాములుగా లేదు సందడి. సందడి సరే.. వారు ఎలా ఉన్నారో, కాస్త రెస్ట్ ఇచ్చే ఉద్దేశ్యం ఏమైనా సినీ ప్రముఖులకు ఉందా.. లేదంటే వాళ్ళు కలిశారు, వీళ్ళు కలిశారు, మనం వెళ్లకపోతే బాగోదు అని అందరూ వరసగా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నారా.
అల్లు అర్జున్ కూడా కాస్త గ్యాప్ ఇవ్వండిరా అనాలని అనిపించినా అనలేని పొజిషన్ లో ఉన్నారా అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. శుక్రవారమంతా పోలీస్ స్టేషన్స్, టెస్ట్ లు, కోర్టు, జైలు అంటూ అలిసిపోయిన అల్లు అర్జున్.. నిన్న శనివారం జైలు నుంచి విడుదలవడం, తర్వాత ఇంటికి చేరడంతో ప్రముఖుల తాకిడి మొదలైంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం అల్లు అర్జున్ ఇంటికిరావడం పోవడమే కనిపించింది.
మీడియా ఫ్రెండ్స్ మొత్తం అల్లు అర్జున్ ఇంటిముందు ఏయే సెలెబ్రిటీ వస్తారా, అల్లు అర్జున్ ను పలకరించడానికి వాళ్ళను కవర్ చెయ్యాలని పడిగాపులు పడిన వీడియోస్, అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని పలకరించి స్నాక్స్ తిని వెళ్లే ప్రముఖులు అబ్బో నిన్న అల్లు ఫ్యామిలీకి అసలు రెస్ట్ ఉంటే ఒట్టు.
తన ఇంటికొచ్చిన వారందరిని సాదరంగా ఆహ్వానిస్తూ వాళ్లతో మాట్లాడుతూ, వాళ్ళు వెళ్లెవరకూ అంటే గేటు వరకు పంపించడం అంతా అల్లు అర్జున్ చాలా ఓపిగ్గా చేసినా.. మనసులో మాత్రం కాస్త గ్యాప్ ఇవ్వండ్రా అని అనుకోకుండా అయితే ఉండి ఉండరు.