మిస్టర్ బచ్చన్ తో హిట్ కొట్టి వరసగా క్రేజీ అవకాశాలు పెట్టేద్దామనుకున్న భాగ్యశ్రీ బోర్సే కి హరీష్ శంకర్ బిగ్ షాకిచ్చాడు. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ భాగ్యశ్రీ బోర్సే ని బాగా ఇబ్బంది పెటేసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే అందాలు బాగా హైలెట్ అయినా.. ఆమె బ్యాడ్ లక్ ఈచిత్రం ఆమెకి ప్లాప్ ఇచ్చింది అనుకుంటే.. భాగ్యశ్రీ బోర్సే కి వస్తోన్న అవకాశాలు చూసి మిగతా హీరోయిన్స్ కుళ్ళుకుంటున్నారు.
మొదటి సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ ఆమెకి క్రేజీ హీరోల ఆఫర్స్ తలుపుతట్టాయి. అందులో ముందుగా లక్కీ భాస్కర్ తో భారీ హిట్ కొట్టిన హీరో దుల్కర్ సల్మాన్ తో రానా ప్రొడక్షన్ లో కాంత చిత్రంలో హీరోయిన్ గా ఎంపికవడమే కాదు, ఎనేర్జిటిక్ హీరో రామ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా అందాలు చూపించడానికి ఆత్రుత చూపించే భాగ్యశ్రీ బోర్సే తాజాగా వదిలిన పిక్ చూస్తే సౌండ్ ఉండదు. చిట్టిపొట్టి నిక్కర్ లో భాగ్యశ్రీ బోర్సే లూజ్ హెయిర్ లో వైట్ టాప్ లో మత్తెక్కించే చూపులతో యూత్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. మరి దుల్కర్, రామ్ కాకుండా ఇంకా ఏ కుర్రహీరోలు భాగ్యశ్రీ బోర్సే కి ఛాన్స్ లు ఇస్తారో చూడాలి.