ప్రస్తుతం రాజమౌళి మహెష్ తో చెయ్యబోయే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఎంతగా తలమునకలై ఉన్నారంటే.. అసలు ఎలాంటి లీకులు SSMB 29 పై వినిపించకూడని విధంగా పకడ్బందీగా వర్క్ చేస్తున్నారు. మధ్య మధ్యలో స్పెషల్ మూమెంట్స్ లో దర్శనమిస్తున్న రాజమౌళి మహేష్ చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెడతారా అని మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చెయ్యని క్షణం లేదు.
ఇక ఈ చిత్రంలో మహేశ్ సరసన హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది అని, కాదు కాదు బాలీవుడ్ బ్యూటీ నే SSMB 29 లో నటిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఈ చిత్రంలో భాగం కాబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ సరసన నటించబోయే హీరోయిన్ అంటున్నాయి ఆ బాలీవుడ్ కథనాలు.
మరి రాజమౌళి హీరోయిన్ విషయంలో ఏమాలోచిస్తున్నారో కానీ.. రాజమౌళి ప్రకటన ఇచ్చేవరకు ఈ హీరోయిన్స్ విషయంలో గాసిప్స్ గానే ఉంటాయి తప్ప నమ్మడానికి లేదు అంటున్నారు కొందరు, బాలీవుడ్ మీడియా మాత్రం రాజమౌళి-మహేష్ కాంబోలో ప్రియాంక చోప్రా నటించే ఛాన్స్ వుంది.. సోర్స్ అదే చెబుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.