మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ మెల్లగా టాలీవుడ్ లో పాగా వేసేందుకు రెడీ అవుతుంది. ఏప్రిల్ లో రాజా సాబ్ తో తెలుగు ఆడియన్స్ ను అలకరించబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో గ్రాండ్ గా టాలీవుడ్ కి రాబోతున్న మాళవిక మోహనన్ ఎక్కువగా స్పెషల్ షూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.
తన అందాలను చూపించే ప్రయత్నంలో ఎపుడు సక్సెస్ అవుతుంది. మోడ్రెన్ అందాలు వేరు, ట్రెడిషనల్ అందాలు వేరు అన్నట్టుగా మాళవిక డ్రెస్ సెన్స్ ఉంటుంది. తాజాగా మాళవిక మోహనన్ క్రీం కలర్ శారీ లో అందాలను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం గట్టిగా చేసింది.
తామర పువ్వుల మధ్యన తెల్లని కలువలా మెరిసిపోయింది. శారీ లోను అందాలను ఇంత ఒద్దికగా చూపించవచ్చు అని మాళవికను చూసి నేర్చుకోవాల్సిందే. మరి మీరు కూడా ఆ తెల్లని కలువ అందాలపై ఓ లుక్కెయ్యండి.