Advertisement
Google Ads BL

షాకింగ్ - అల్లు అర్జున్ అరెస్ట్


పుష్ప ద రూల్ సక్సెస్ తో సంబరాలు చేసుకోవాల్సిన అల్లు అర్జున్ అరెస్ట్ అవడం కలకలం సృష్టించింది. పుష్ప 2 ద రూల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం ఢిల్లీ వెళ్లొచ్చిన అల్లు అర్జున్ ను ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. డిసెంబర్ 4 రాత్రి పుష్ప ప్రీమియర్ సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసారు. 

Advertisement
CJ Advs

ఈ కేసులో తన తప్పు లేదు అంటూ అల్లు అర్జున్ ఇప్పటికే హై కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు విచారణ ఈరోజు జరగనున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్దనే అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంధ్య థియేటర్ తొక్కిసలాట లో ఓ మహిళ మృతి చెండం, మరో బాబు ఆసుపత్రిలో సీరియస్ కండిషన్ లో ఉండడంతో పోలీసులు హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేసారు. మరికాసేపట్లో అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది. 

Shocking - Allu Arjun Arrested:

Pushpa 2 The Rule Hero Allu Arjun Arrested
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs