Advertisement
Google Ads BL

ధనుష్ కి నా మీద కోపమెందుకో - నయనతార


నయనతార-ధనుష్ వ్యవహారం కోలీవుడ్ లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. నయనతార ధనుష్ పై విరుచుకుపడుతూ ఓపెన్ లెటర్ రాయడం, ధనుష్ నయనతార తన సినిమాలోని క్లిప్స్ వాడుకున్నందుకు 10 కోట్ల దావా వెయ్యడమే కాదు, ధనుష్ ఈ విషయంలో కోర్టుకెక్కాడు. నయనతార డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీనే క్లిప్స్ ని వాడుకున్నందుకు గాను ధనుష్ నయనతార విషయములో విభేదాలు మొదలయ్యాయి. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా నయనతార-ధనుష్ వివాదాన్ని విచారించిన కోర్టు నయనతారకు షాకిచ్చింది. ధనుష్ అనుమతి లేకుండా నయనతార ఆ చిత్రంలోని క్లిప్పింగ్స్ వాడుకోవడం నేరమని, ధనుష్‌ నిర్మించిన సినిమాకి సంబంధించిన క్లిప్స్‌ వాడుకోవాలంటే అతని అనుమతితోనే చేయాలి తప్ప ఇష్టానికి వాడుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై జనవరి 8 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార-ధనుష్ వివాదంలో కోర్టు తీర్పునిచ్చింది. 

అయితే నయనతార ఈ వివాదంపైన మాట్లాడుతూ ధనుష్ ను కలిసి మేము NOC తీసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు, మేము ఫోన్ చేసినా ధనుష్ ఎత్తలేదు, కామన్ ఫ్రెండ్ తోనూ మాట్లాడించాలని చూసాము, కానీ ధనుష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు, ధనుష్ తో మా స్నేహం బాగానే ఉంది. కానీ ఈ పదేళ్లలో ఏమైందో ఏమో తెలియదు. 

ధనుష్ కి మాపై కోపమెందుకు వచ్చిందో తెలియదు, చెప్పుడు మాటలు విని ఇలా ధనుష్ చెయ్యడం కరెక్ట్ కాదు, ధనుష్ ని కలిసేందుకు ప్రయత్నం చేసినా అవ్వలేదు, అందుకే నేను ఓపెన్ లెటర్ రాయాల్సి వచ్చింది. నేను చేసింది తప్పు కాదు అంటూ నయనతార ధనుష్ విషయంలో స్పందించడం విశేషం. 

Nayanthara reacts to people calling her open letter to Dhanush :

Madras High Court hears Dhanush plea to restrain Nayanthara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs