Advertisement
Google Ads BL

వారిపై లీగల్ యాక్షన్ - సాయి పల్లవి


నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకపోయినా ఆమె నటించే సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఆమెపై ఎక్కడలేని గాసిప్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. తరచూ సాయి పల్లవి పై ఈ రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అమరన్ అప్పుడు కూడా ఆమె ఆర్మీ వాళ్ళను ఏదో అంది, ఆమె క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ కూడా చేసారు. అమరన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి పల్లవి ప్రస్తుతం తండేల్, హిందీలో రామాయణ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. 

Advertisement
CJ Advs

తాజాగా సాయి పల్లవి పై ఓ ప్రముఖ పత్రిక ఉన్నవి లేనివి రాసుకొచ్చింది. సాయి పల్లవి రామాయణ లోని సీత పాత్ర కోసం తన అలవాట్లను మార్చుకుందని, ఆ పాత్ర కోసమే ప్రత్యేక నియమాలను ఏర్పరచుకుందంటూ రాయడమే కాదు, సాయి పల్లవి నాన్ వెజ్ మానేసింది, ఆఖరికి హోటల్ లో కూడా తినడం లేదు, విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా వంట వాళ్లను తన వెంట తీసుకెలుతుంది అంటూ రాసుకొచ్చింది. 

దీనిపై సాయి పల్లవి ఘాటుగా రియాక్ట్ అయ్యింది. తన సోషల్ మీడియా ఖాతాలో సాయి పల్లవి.. నాపై ఎన్నోసార్లు ఉన్నవి లేనివి క్రియేట్ చేశారు. అలాంటి రూమర్స్ వచ్చినా నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే.. అందులో నిజం ఎంతో అనేది ఆ దేవుడికే తెలుసు. కానీ నేను సైలెంట్ గా  ఉంటున్నానుగా అని ఏదిబడితే అది రాయడం కరెక్ట్ కాదు. లేనిపోని వార్తలు రాస్తున్నారు. ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది. 

నా సినిమాల గురించి, అలాగే నా కెరియర్ గురించి రాసేముందు, మాట్లాడుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, అవాస్తవాలు, ఆధారాలు లేనివి రాయకూడదు. అది రాసేది ఎవ్వరైనా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సహించాను. ఇలాంటి అసత్య ప్రచారాలను తాను భరించడానికి సిద్ధంగా లేని అంటూ సాయి పల్లవి తనపై గాసిప్స్ క్రియేట్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చింది. 

Sai Pallavi says she will sue the media for rumors:

No more cooked up stories: Sai Pallavi replies to rumors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs