Advertisement
Google Ads BL

మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు


మంచు వారి ఇంట రచ్చ ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఆస్తి పంపకాల గోల కాస్తా పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. మంచు మనోజ్-మోహన్ బాబు మద్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తార స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. ఈ మధ్యలో వీరి గొడవను కవరేజ్ చేసేందుకు అత్యుత్సాహం చూపించిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకోవడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

మంచు మనోజ్ తన ఇంట్లోకి గేట్లు విరగ్గొట్టి లోపలి వెళుతున్న సమయంలో మోహన్ బాబు శాంతంగానే మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రాగా.. జర్నలిస్ట్ లు వేసిన ప్రశ్నలకు చిర్రెత్తుకొచ్చి ఆయన ఛానళ్ల ప్రతినిధిపై మైక్ వేసి కొట్టడంతో జర్నలిస్ట్ లకు-మోహన్ బాబు మధ్యన వివాదం రాజుకుంది. 

జర్నలిస్ట్ పై చేయిచేసుకున్న మోహన్ బాబుపై జర్నలిస్ట్ లోకం భగ్గుమంది. జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలతో హోరెత్తింది. పోలీసులు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Film Actor Mohan Babu Charged with Attempt to Murder Case:

Police Book Veteran Tollywood Actor Mohan Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs