పుష్ప ద రూల్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. పుష్ప పార్ట్ 1 తోనే నేషనల్ అవార్డు తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప 2 తో కలెక్షన్స్ పరంగా రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది.. పుష్ప 2 కలెక్షన్స్ జాతర.
ఇక పుష్ప 2 తర్వాత పుష్ప 3 చెయ్యడానికి అల్లు అర్జున్ అయితే సిద్ధంగా లేడు. అందుకే అల్లు అర్జున్ కొద్దిరోజులు బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ కి ఆ సమయాన్ని కేటాయించి, కాస్త రిలాక్స్ అయ్యాకే ఆయన త్రివిక్రమ్ తో మూవీ మొదలు పెడతారని తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత నెక్స్ట్ చేయబోయేది త్రివిక్రమ్ తోనే. వీరి కలయికలో మొదలు కాబోయే ప్రాజెక్ట్ ఓ వీడియో అనౌన్సమెంట్ తో రాబోతుంది అని సమాచారం.
అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ పై ఓ స్పెషల్ వీడియోతో ఇచ్చే అనౌన్సమెంట్ సంక్రాంతి పండుగ తర్వాత ఉండొచ్చని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కాలంటే ఇంకో నెల పైనే అల్లు అభిమానులు వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది. అసలే బిగ్ ప్రాజెక్ట్, పాన్ ఇండియా ప్రాజెక్ట్, గత ఏడాదిగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నారు.