మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటివరకు రియాక్ట్ కాని మంచు విష్ణు తొలిసారి మీడియా మీట్ లో మట్లాడారు. మంచు మోహన్ బాబు, మనోజ్ మద్యన గత రెండు రోజులుగా జరుగుతున్న గొడవ సినిమా స్క్రిప్ట్ ని మించిపోయింది. ఈ వివాదం జరుగుతున్న సమయంలో మంచు విష్ణు అమెరికాలో ఉన్నారు, ఆయన లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరి దుబాయ్ నుంచి నిన్న మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు.
తాజాగా మంచు విష్ణు మంచు ఫ్యామిలీ వివాదంపై రియాక్ట్ అయ్యారు. మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా. కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. ఎంతమంది గొడవపడి విడిపోయి మళ్ళీ కలవడం లేదు, మేము మళ్లీ తిరిగి కలుస్తామని ఆశిస్తున్నా. ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్.
ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈరోజు అమ్మ ఆస్పత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. రాత్రి జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను.
అన్నింటికంటే కుటుంబం ముఖ్యం. ముందుగా ఏం జరుగుతుందో అర్థంకాలేదు. నేను ఊరులో లేని నాలుగు రోజుల్లో ఇదంతా జరిగింది. నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరినీ బాధపెట్టాలనుకోలేదు అంటూ మంచు విష్ణు క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే చేసారు.