Advertisement
Google Ads BL

మంచు వారి పంచాయతీలోకి పనిమనిషి


అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకోవడం అనేది కొత్తేమి కాదు, ప్రతి ఇంట్లో అన్నద్మములు ఉంటే జరిగేది ఇదే. ఎక్కడో కానీ ప్రశాంతంగా ఆస్తి పంపకాలనేవి జరగవు. ఇక చాలా సినిమాల్లో అన్నదమ్ముల మధ్యన ఆస్తి పంపకాలు హత్యలకు దారి తియ్యడమనేది చూపిస్తూ ఉంటారు. ఇప్పడు సినిమా కన్నా ఎక్కువ పంచాయతీ మంచు ఫ్యామిలిలో జరుగుతుంది. 

Advertisement
CJ Advs

కొన్నాళ్లుగా జరుగుతున్న మంచు వారి ఆస్తి వ్యవహారం ఇప్పుడు రోడ్డెక్కింది. మంచు మనోజ్ vs మంచు విష్ణు గా ఈ వ్యవహారం నడవాల్సింది పోయి చిన్న కొడుకు మంచు మనోజ్ vs తండ్రి మంచు మోహన్ బాబు అన్న రేంజ్లో జరుగుతుంది. ఆస్తుల కోసం మనోజ్ మోహన్ బాబు పై దాడికి తెగబడ్డాడు అని మోహన్ బాబు, డబ్బు కోసం, ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను.. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. న్యాయం కోసం అందరిని కలుస్తా.. నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, అందుకే పోరాటం.. అంటూ మంచు మనోజ్ మాట్లాడుతున్నారు. 

తాజాగా మంచు వారి పనిమనిషి మంచు పంచాయితీలోకి ఎంటర్ అయ్యింది. మోహన్ బాబు-మనోజ్ మధ్యన స్వల్ప తోపులాట జరిగింది, మంచు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకోవడం మోహన్ బాబు అయన కుటుంబానికి అసలు ఇష్టం లేదు, మోహన్ బాబు - మనోజ్ తోసుకున్నారు, ఈ దాడిలో మనోజ్ కి ఎలాంటి గాయాలవలేదు అంటూ  మంచు వారి పనిమనిషి కామెంట్స్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. 

Mohan Babu vs Manoj:

Manchu Mohan Babu vs Manchu Manoj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs