నాగబాబుకు ఈ శాఖ ఫిక్స్ అయినట్టేనా?
అన్న నాగబాబును తమ్ముడు పవన్ కళ్యాణ్ కష్టపడి మరీ మంత్రిని చేయబోతున్నారు..! అధికారకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన చేశారు..! హస్తినకు పంపాలని భావించినట్టికీ ఆఖరి నిమిషంలో రాజ్యసభ స్థానం వదులుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మెగా బ్రదర్ కేంద్ర మంత్రి అయ్యే స్థాయి కానీ అమరావతికే పరిమితం అవుతున్నారు. ఏదైతేనేం మంత్రి పదవి ఐతే దక్కింది చాలు అని అభిమానులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ ఆయనకు ఏ శాఖ ఇవ్వబోతున్నారు..? ఎంతటి ప్రాధాన్యత ఉంటుంది? అన్నది మెగాభిమానుల్లో మెదులుతున్న సమాధానం దొరకని ప్రశ్న.
మార్పులు, చేర్పులు ఉంటాయా..?
సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా, టాలీవుడ్ గురుంచి అణువణువు తెలిసిన నటుడిగా ఇన్నాళ్లు ఉన్న నాగబాబు ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది..? కచ్చితంగా ఈ శాఖకు న్యాయం చేయడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే జూనియర్ ఆర్టిస్టుగా జీవితం మొదలుపెట్టి హీరో, విలన్, నిర్మాత ఆఖరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పని చేసిన అనుభవం ఉండటంతో ఈ శాఖకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ శాఖ జనసేన పార్టీ చేతిలోనే ఉంది. కందుల దుర్గేష్ పర్యాటక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చూస్తున్నారు. ఈయన నుంచి నాగబాబుకు శాఖ షిఫ్ట్ చేసి ఆయనకు పర్యాటకతో పాటు మరో శాఖ కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. త్వరలోనే మార్పులు, చేర్పులు చేసి కేటాయింపులు చేసే ఛాన్స్ ఉంది. పైగా డిప్యూటీ సీఎం పవన్, సీఎం పవన్ కళ్యాణ్ తలచుకుంటే నిమిషాల్లో ఇదంతా ఐపోతుంది. దీనిని తోడు నాగబాబు కూడా ఈ శాఖ వైపే మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదు.
మంత్రి ఎలా సాధ్యం..?
నాగబాబు ఎమ్మెల్యే కాదు, కనీసం ఎమ్మెల్సీ కూడా కాదు మరి మంత్రి పదవి ఎలా సాధ్యం అన్నది చాలా మందికి అర్థం కానిది. అవును ఈ రెండూ కాకపోయినా మంత్రి అవ్వొచ్చు. తొలుత మంత్రిగా ప్రమాణం చేసి ఆర్నెల్ల గడువులో ఎమ్మెల్సీ అవ్వొచ్చు. లేదంటే ఎమ్మెల్సీ అయ్యాక కూడా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టవచ్చు. వాస్తవానికి వైసీపీ నుంచి నలుగురు ఐదుగురు తమ ఎమ్మెల్సీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి.. మండలి చైర్మన్ మోషేను రాజుకు పంపారు. ఐతే ఆయన అందించకుండా అలాగే పెండింగులో పెట్టారు. ఎందుకంటే ఆయన వైసీపీకి చెందిన మనిషి కనుక. ఇప్పుడిక ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వస్తే ఆమోదించాక తప్పదు. ఖాళీ అయిన ఏదో ఒక స్థానం నుంచి నాగబాబును పోటీ చేపించి, గెలిపించుకోవాల్సి ఉంటుంది. టీడీపీ కూటమి అధికారంలో ఉండటం, పైగా పోటీ అనేది వైసీపీ నుంచి ఏ మాత్రం లేకపోవడంతో నాగబాబు గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో.. ఏంటో చూడాలి మరి.