పెళ్ళిలో కంచి పట్టు చీరలతో, చేతి నిండా మెహిందీ తో, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో శోభిత ఎంత అందంగా చక్కటి తెలుగింటి ఆడపడుచులా నాగ చైతన్య తో మెడలో మూడు ముళ్ళు వేయించుకుని అక్కినేని నాగార్జున ఇంటికి సాంప్రదాయంగా కోడలు గా అడుగుపెట్టిందో అందరూ చూసారు. అలా శోభిత అక్కినేని అభిమానులను మురిపించింది.
చైతు తో డిసెంబర్ 4 న పెళ్లి జరిగాక సత్యన్నారాయణ వ్రతం, ఇంకా అక్కినేని ఇంటి పార్టీ కోసం శోభిత మోడ్రెన్ గా మారిపోయింది. శోభిత పెళ్లి అవ్వగానే మోడ్రెన్ లుక్ తో కనిపించి షాకిచ్చింది, గోల్డ్ కలర్ మోడ్రెన్ వేర్ లో శోభిత లేటెస్ట్ లుక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
చేతికి ఇంకా మెహిందీ పోకముందే శోభిత ఈ లుక్ లో కనిపించడం పై అభిమానులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నా.. శోభిత అలా మోడ్రెన్ గా తయారైంది మాత్రం అక్కినేని కాక్ టైల్ పార్టీ కోసమే అని తెలుస్తోంది. శోభిత ప్రొఫెషన్ అలాంటింది. ఆమె ఇలాంటి లుక్స్ తోనే సినిమా అవకాశాలు అందుకోవాలి కాబట్టి ఇవన్నీ కామన్ అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.