ఆగష్టు 15 న భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్ తంగలాన్ చిత్రం థియేటర్స్ లో 100 కోట్లకు పైగానే కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చి చాలా రోజులు అయ్యింది. కొన్ని కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది.
తంగలాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకుంది. ఎప్పడెప్పుడు తంగలాన్ చిత్రాన్ని ఓటీటీ లోకి రిలీజ్ చేస్తారా అని ఆడియన్స్ వెయిట్ చేస్తుంటే.. అదిగో తంగలాన్ ఓటీటీ రిలీజ్, ఇదిగో తంగలాన్ ఓటీటీ రిలీజ్ అంటూ ఊరించారు తప్ప డేట్ ఇవ్వలేదు.
ఇప్పుడు ఈ చిత్రం చడీ చప్పుడు చెయ్యకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రకటించిన డేట్ కన్నా కూడా ముందుగానే సడెన్ గా ఓటీటీలో కి ప్రత్యక్షమయ్యెసరికి ఓటీటీ ఆడియన్స్ షాకవుతుంటే విక్రమ్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.