నాగ్ పెద్దకొడుకు నాగ చైతన్య పెళ్లి వారం రోజుల్లో జరుకాబోతుంది అనే సమయంలో తన చిన్న కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా నాగార్జున ప్రకటించడం సంచలనం అయ్యింది. నవంబర్ 26 జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ హైదరాబాద్ లోని తన నివాసంలోనే నిశ్సితార్ధం చేసుకుని అక్కినేని ఫ్యాన్స్ కి షాకిచ్చాడు.
ఇక నాగ చైతన్య పెళ్లిలో అఖిల్ తో పాటుగా జైనాబ్ రవ్జీ కూడా సందడి చేసింది. కజిన్స్ గ్రూప్ ఫోటో లో జైనాబ్ రవ్జీ చీరకట్టులో కనువిందు చేసింది. తాజాగా తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీ అఖిల్ అక్కినేని దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అది చూసిన అక్కినేని అభిమానులు ఫియాన్సీ జైనాబ్ రవ్జీతో అక్కినేని ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.