నిన్న మంచు మనోజ్ పై జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర దాడి జరగడం, మోహన్ బాబు అనుచరుడు వినయ్ మంచు మనోజ్ పై దాడికి తెగబడగా మంచు మనోజ్ మెడకు, కాలికి గాయాలయ్యాయి, దానితో మంచు మనోజ్ హైదరాబాద్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకున్నాడు. నిన్నంతా మంచు వారి రచ్చ మీడియాలో ప్రముఖంగా వినిపించింది.
ఈ వ్యవహారంలో మంచు విష్ణు దుబాయ్ లో ఉండగా, మంచు లక్ష్మి ముంబైలో ఉన్నారు. ఈరోజు విష్ణు దుబాయ్ నుంచి బయలుదేరగా, మంచు లక్ష్మి ఇప్పటికే ముంబై నుంచి జల్ పల్లిలోని మోహన్ బాబు గారింటికి చేరుకొన్నారు. తాజాగా మోహన్ బాబు ఇంటి దగ్గర బౌన్సర్లు కోలాహలం కనిపిస్తుంది.
జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా చేరుకుంటున్న బౌన్సర్లు.. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. వాళ్లకు పోటీగా 30 మంది బౌన్సర్లను తెప్పించిన మంచు మనోజ్.. అయితే మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించని మోహన్ బాబు సెక్యూరిటీ...
మరికాసేపట్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్న మంచు విష్ణు, విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉండడం తోనే అక్కడ బౌన్సర్లు పెద్ద ఎత్తున చేరుకున్నట్టుగా తెలుస్తోంది.