మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైలింగ్ పై ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ సార్ గా ప్రొజెక్ట్ అయ్యారు. కానీ ఆ గ్లోబల్ స్టేటస్ ని మైంటైన్ చెయ్యాలంటే ఓ రేంజ్ స్టైలింగ్ ని చూపించాలి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎయిర్ పోర్ట్ లో కానీ, మిగతా ఎక్కడైనా చాలా క్యాజువల్ గా హ్యాంగర్ కి ఉన్న చొక్కా వేసుకుని వెళ్లిపోతుంటాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంప్లైంట్.
అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి బయట కనిపిస్తే బ్రాండ్ తో కనిపిస్తారు, షర్ట్ దగ్గరనుంచి, షూస్ వరకు, హెయిర్ స్టయిల్ దగ్గర నుంచి చేతికి ఉన్న వాచ్ వరకు, భుజానికి వేసుకునే బ్యాగ్ దగ్గర నుంచి క్యాప్ వరకు అన్ని అందరూ మాట్లాడుకునేలా బ్రాండెడ్ స్టయిల్స్ చూపిస్తారు. వారు బయట కనబడితే ఫ్యాన్స్, జనాలు వాళ్ళు ధరించే బ్రాండ్స్ గురించే మాట్లాడుకుంటారు.
అదే ఎన్టీఆర్ విషయంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2 కోసం ముంబై వెళ్లివస్తున్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు, ముంబై వెళ్ళినపుడు మాత్రమే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎన్టీఆర్ స్టైలింగ్ గురించిన ముచ్చట వినిపించడమే లేదు, అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డిజప్పాయింట్ కలిగిస్తుంది. అందుకే ఎన్టీఆర్ అన్నా స్టయిల్ మార్చు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.