బిగ్ బాస్ సీజన్ 7 లో అశ్వద్ధామ 2.ఓ అంటూ బిల్డప్ ఇచ్చి మద్యలోనే ఎలిమినేట్ అయిన డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇప్పుడు టాప్ 5 లోకి అడుగుపెట్టాడు. అయితే గౌతమ్ కన్నడ బ్యాచ్ విషయంలో చాలా ఇరిటేటింగ్ గా కనిపంచేవాడు. వాళ్ళేం మాట్లాడినా ఈవెన్ ఏరా అన్నా అది తప్పుగా ప్రొజెక్ట్ చేసి వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు.
అయితే గౌతమ్ నామినేషన్స్ లోకి వచ్చాడు అంటే ఒకటి రెండు వారాలు నిఖిల్ ఓటింగ్ లో అతనిని డామినేట్ చేసినా ఆతర్వాత గౌతమ్ స్ట్రాంగ్ అయ్యి నామిషన్స్ లో ఉన్న ప్రతిసారి నిఖిల్ కి పోటీ ఇస్తూ ఓటింగ్ లో నెంబర్ 1 ప్లేసులో కనిపిస్తున్నాడు. అయితే నాగార్జున రెండుమూడుసార్లు గౌతమ్ తప్పులను ఎత్తి చూపిస్తే అదిగో నాగార్జున, బిగ్ బాస్ కావాలని గౌతమ్ ని బ్యాడ్ చేశారన్నారు.
ప్రస్తుతం టాప్ 5 లోకి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్న గౌతమ్ క్రేజ్ ని నాగ్ కాస్త తగ్గించారు. ఈవారం నిఖిల్ తో గౌతమ్ ప్రవర్తించిన తీరును నాగార్జున ఎండగట్టారు. గౌతమ్ మూసుకో అనే పదం, వాడుకుంటున్నావ్ అనే పదాలు చాలా తప్పు కానీ ఎదుటి వాళ్ళది తప్పు అంటావ్, నేను తప్పు చేస్తే సారీ చెబుతాను అన్నారు నాగ్.
గౌతమ్ చాలావరకు రిగ్రెట్ అవ్వకపోయినా ఫైనల్ గా గౌతమ్ తో నాగార్జున సారీ చెప్ప్పించారు. అయితే ఎలా లేదన్నా ఈసారి నిఖిల్ బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా నిలిచి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ తీసుకెళ్తాడని అనిపిస్తుంది.