కలర్‌ఫొటో చిత్ర సందీప్ రాజ్ పెళ్లి కొడుకయ్యాడు. శుభముహుర్తాన సందీప్ రాజ్ హీరోయిన్ ని పెళ్లాడాడు. కలర్ ఫోటో చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ పొషించిన చాందినీరావును సందీప్ రాజ్ ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తిరుమలలో సందీప్ రాజ్-చాందిని రావు లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో సందీప్ రాజ్, చాందిని రాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచారు.
ఈ పెళ్లిలో పెద్దగా సెలబ్రిటీస్ ఎవరూ కనిపించకపోయినా కలర్ ఫొటో హీరో సుహాస్ తన ఫ్యామిలీతో కలిసి కొత్త జంటను ఆశీర్వదించాడు.