బిగ్ బాస్ సీజన్ 8 మరోక్క వారంలో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రెడీ అవుతుంది. ఈ వారమంతా ఓటింగ్ రిక్వెస్ట్ కోసం కంటెస్టెంట్స్ అంతా టాస్క్ ల్లో పోటీపడ్డారు. ఆ టాస్క్ ల్లో ముందుగా ప్రేరణ ఓటింగ్ అప్పీల్ గెలుచుకుని ప్రేక్షకులను తనకు ఓటెయ్యమని రిక్వెస్ట్ చెయ్యగా.. ఆతర్వాత నబీల్, విష్ణు ప్రియా, నిఖిల్ ఓట్ అప్పీల్ కు వెళ్లారు. చివరి టాస్క్ లో గౌతమ్-నిఖిల్ ఓట్ ఆపిల్ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు.
ఇక ఈ వారం నామినేషన్స్ లో అవినాష్ తప్ప మిగతా వారంతా నామినేషన్ లో ఉన్నారు. అందులో గౌతమ్ ఓటింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉండగా, నిఖిల్ సెకండ్ పొజిషన్ మైంటైన్ చేస్తున్నాడు, తర్వాత స్థానంలో నబీల్, ప్రేరణ ఉండగా.. డేంజర్ ప్లేస్ లో విష్ణు ప్రియా, రోహిణి ఉన్నారు.
సో ఈ వారం అంటే లాస్ట్ ఎలిమినేష విష్ణుప్రియ-రోహిణీలలో ఎవరో ఒకరు ఉండొచ్చు అనే అందరూ అనుకుంటున్నారు. ఫైనల్ గా ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో, లేదంటే హౌస్ లో టాప్ 5 ఉంచి మరో ఎలిమినేషన్ కూడా చేస్తారా అనేది ఈ రోజు నైట్ కల్లా తెలిసిపోతుంది.