అక్కినేని ఇంటి కోడలు గా, నాగ చైతన్య కు భార్యగా మారిన శోభిత దూళిపాళ్ల తన మెడలో చైతు తాళికట్టే సమయంలో భావేద్వేగానికి గురైంది. నాగ చైతన్య తన మెడలో మూడు ముళ్ళు వేసిన సందర్భంలో శోభిత తాళి బొట్టును చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది. పక్కనే ఉన్న నాగార్జున కొడుకు-కోడలిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఇక తన కోడలిని తన ఫ్యామిలీలోకి వెల్ కమ్ చెబుతూ నాగార్జున సోషల్ మీడియాలో ఎమోషనల్ గా స్పందించారు. ఈ రోజు మాపై కురిపించిన ప్రేమ ఆశీర్వాదాలకు ఎంతో కృతజ్ఞలం. శోభిత-చై కలిసి ఈ అందమైన అధ్యయనాన్ని ఆరంభించడం ఓ ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. ప్రియమైన చై కి అభినందనలు.
డియర్ శోభిత మా ఫ్యామిలిలోకి ఆహ్వానం, నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని నింపావు అంటూ నాగార్జున ఎమోషనల్ గా కొడుకు, కోడలికి ఆహ్వానం పలుకుతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.