గతంలో సమంత నాగ చైతన్య ను వివాహం ఆడినప్పడు గోవాలో వారు రెండుసార్లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఒకటి హిందూ సాంప్రదాయంలో, ఆతర్వాత సమంత-చైతు క్రిష్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా కీర్తి సురేష్ కూడా పెళ్లి విషయంలో సమంతనే ఫాలో కాబోతుంది. ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తో ప్రేమలో పడి ఈనెల 12 న గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్న కీర్తి సురేష్ తన పెళ్లిని హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం చేసుకోబోతుంది. డిసెంబర్ 12 ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం కీర్తి సురేష్-ఆంటోనీల వివాహం జరగనున్నట్లుగా తెలుస్తోంది.
డిసెంబర్ 10 కల్లా కీర్తి సురేష్ ఫ్యామిలీ, ఆంటోని కుటుంబ సభ్యులు గోవాకి చేరుకుంటారని, డిసెంబర్ 10 నుంచే కీర్తి సురేష్-ఆంటోని వివాహ వేడుకలు మొదలు కాబోతున్నాయట.