నాగ చైతన్య-శోభిత ల వివాహానికి మరికొద్ది గంటలే సమయం మిగిలి ఉంది. గత నాలుగు రోజులుగా చైతు-శోభితల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ను అక్కినేని అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చైతు-శోభితల మంగళ స్నానాలు, శోభితను తన ఫ్యామిలీ మెంబెర్స్ పెళ్లి కూతురుగా ముస్తాబు చెయ్యడం ఇవన్నీ హైలెట్ అవుతూనే ఉన్నాయి
ఇక ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరావు గారి విగ్రహం ఎదురుగా వేసిన స్పెషల్ పెళ్లి సెట్ లో చైతు-శోభితల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగబోతుంది. ఈరోజు రాత్రి 8.13 నిమిషాలకు చైతు, శోభిత మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవబోతున్నాడు. ఈ శుభతరుణం కోసం అక్కినేని అభిమానులు, శోభిత అభిమానులు వెయిట్ చేసున్నారు.
అయితే చైతు పెళ్లి ఫొటోస్ ని అక్కినేని కాంపౌండ్ షేర్ చేస్తుందా లేదంటే అనే విషయంలో అభిమానుల్లో చాలా క్యూరియాసిటి నడుస్తుంది. చైతు-శోభితల పెళ్లి పిక్ కోసం మూవీ లవర్స్ అంతా వెయిటింగ్ ఇక్కడ.