ఈ నెలలోనే పెళ్లి పీటలేక్కబోతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్స్ గ్లామర్ గానే కాదు సిగ్గుపడుతూ ఇస్తున్న ఫోజులకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని ని కీర్తి సురేష్ డిసెంబర్ లో పెళ్లాడబోతున్నట్టుగా, తమ పెళ్లి గోవా వేదికగా జరగబోతున్నట్టుగా రీసెంట్ గానే రివీల్ చేసిన కీర్తి సురేష్ అటు పెళ్లి పనులు ఇటు హిందీ సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడిపేస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కీర్తి సురేష్ గ్లామర్ షో చూస్తే కొంతమంది వధువయ్యే తరుణంలో సిగ్గులొలికే వదనం అంటూ పాజిటివ్ గా స్పందిస్తుంటే కొంతమంది మాత్రం పెళ్ళికి ముందు గ్లామర్ డోస్ పెంచాల్సిన అవసరం ఏముంది, గతంలో పద్దతిగా ఉన్నట్టుగా ఉండొచ్చుగా అంటూ స్పందిస్తున్నారు.
మరి తాను నటించిన బాలీవుడ్ సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ ఈ మాదిరి అందాలు చూపించకపోతే నార్త్ ఆడియన్స్ కు ఆనదు, అందుకే కీర్తి సురేష్ గ్లామర్ ని ఎక్కువగా కనిపించేలా ఇలాంటి ఫోటో షూట్స్ వదులుతుంది.