రష్మిక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా రష్మిక పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. మరోపక్క పుష్ప ద రూల్ ఈవెంట్స్ తో ఆమె చీర కట్టుతో కనికట్టు చేస్తూ యూత్ ని పడేస్తుంది. ప్రస్తుతం ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ నేషనల్ క్రష్ కి ఉంది అంటే నమ్మి తీరాల్సిందే. ఏ కేరెక్టర్ అయినా అలవోకగా అదరగొట్టేసే ఈ శ్రీవల్లి మరో రెండు రోజుల్లో పాన్ ఇండియాలోని పలు భాషల్లో పుష్ప 2 తో రాబోతుంది.
అయితే యానిమల్ చిత్రంలో బోల్డ్ గా కనిపించి షాకిచ్చిన రష్మిక పుష్ప ద రూల్ లో అల్లు అర్జున్ తో కలిసి పీలింగ్స్ అంటూ వేసిన గ్లామర్ స్టెప్స్ చూస్తే మతిపోవాల్సిందే. హీరోయిన్స్ అందరూ గ్లామర్ చూపిస్తారు, కానీ శ్రీవల్లి రష్మిక మందన్న అందాలు, ఆమె గ్లామర్ మాత్రం వేరే లెవల్ అనాల్సిందే.
ప్రస్తుతం రష్మిక టైమ్ నడుస్తుంది. ఆమె వరస సినిమా షూటింగ్స్ తో ముంబై టు చెన్నై టు హైదరాబాద్ అంటూ తెగ తిరిగేస్తుంది. గత పది రోజులుగా పుష్ప ద రూల్ ప్రమోషన్స్ తో రష్మిక అందాల విందుకు అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ రేంజ్ అందాలు ఆరబోత చూస్తే రశ్మికను తట్టుకోవడం కష్టమే సుమీ అంటారేమో..!