గత సీజన్ లో గౌతమ్ ని యాక్టర్ శివాజీ ఎంతగా ఎక్స్ పోజ్ చేద్దామని ట్రై చేసినా అశ్వద్ధామ 2.ఓ అంటూ సీజన్ 7లో ఎక్సట్రాలు చేసిన డాక్టర్ సాబ్ గౌతమ్ ని బుల్లితెర ప్రేక్షకులు త్వరగానే ఎలిమినేట్ చేసేసారు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో ఊపేసిన గౌతమ్ కన్నడ బ్యాచ్ కి చుక్కలు చూపిస్తున్నాడు. ఎవ్వరు మాట్లాడినా అది డిశ్ రెస్పెక్ట్ , మీకు మాట్లాడే పద్దతి తెలియదు అంటూ తప్పుబట్టే గౌతమ్ కూడా చాలాసార్లు మాట తూలాడు.
అంతెందుకు గౌతమ్ ని వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున చాలాసార్లు వాదిస్తూ షటప్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కావాలనే నాగార్జున, బిగ్ బాస్ గౌతమ్ ని డీ ఫేమ్ చేస్తున్నారని కొందరు ప్రచారం మొదలు పెట్టారు. హౌస్ లో అందరితో మంచిగానే ఉంటూ ఎవరినైనా ఎక్స్పోజ్ చెయ్యాలంటే నోరేసుకుని పడిపోయే గౌతమ్ తో రాత్రి నామినేషన్స్ విషయంలో నిఖిల్ తో పెద్ద ఫైట్ అయ్యింది.
డిశ్ రెస్పెక్ట్ డిశ్ రెస్పెక్ట్ అంటూ మాట్లాడే గౌతమ్ మాట తూలాడు, నిఖిల్ ని మూసుకుని కూర్చో అన్నాడు. నన్నేం పీకలేవు, అలాగే నిఖిల్ తో నామినేషన్స్ అప్పుడు నువ్వు మూసుకుని కూర్చో అనేది డిస్ రెస్పెక్ట్ కాదా అంటూ ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ తన బిగ్ బాస్ రివ్యూ లో గౌతమ్ ని ఏకి పారేసింది.
నువ్వు ఎదుటోళ్లని అన్నపుడు నిన్ను ఎవరైనా అంటే మాత్రం పడవు, అది డిశ్ రెస్పెక్ట్ అంటూ గింజుకుంటావు గౌతమ్, ఫ్రెండ్ అయినా నేను నువ్వు తప్పు చేస్తే తప్పే అని చెబుతాను అంటూ ఎడా పెడా గౌతమ్ ని ఏసుకుంది.