ప్రస్తుతం దునియా మొత్తం పుష్ప2 మ్యానియాతో కొట్టేసుకుంటున్నారు. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం పుష్ప ద రూల్ చూసెయ్యాలనే క్యూరియాసిటీతో కనిపిస్తున్నారు. దానికి ఉదాహరణ పుష్ప ద రూల్ ఈవెంట్ ఎక్కడ పెట్టినా దానిని సూపర్ సక్సెస్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈవెంట్ లోను అభిమానుల ఆరాటం చూసాక ఆపాలంటే ఆపగలరా అంటూ మాట్లాడుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఎవరైనా పుష్ప ద రూల్ పై నెగిటివిటి స్ప్రెడ్ చేసినా ప్రస్తుతం పుష్ప ద రూల్ పై ఉన్న అంచనాల్లో అది కొట్టుకుపోవడం ఖాయం, ప్రెజెంట్ పుష్ప ద రూల్ పై ఉన్న హైప్ ముందు అది నథింగ్, ఆ నెగిటివిటి పుష్ప రాజ్ ని ఏమి చెయ్యలేదు అంటూ అల్లు ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.
పుష్ప ద రూల్ ప్రమోషన్స్ అనే కాదు, పాటలు, ట్రైలర్, అన్నీ పుష్ప ద రూల్ విషయంలో అంచనాలు తప్పవని అర్ధమైపోతుంది అంటూ అల్లు ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంతో తగ్గేదేలే, ఖచ్చితంగా కొట్టి చూపిస్తాము అంటూ వారు ధీమా వ్యక్తం చెయ్యడం చూస్తే ఆపాలన్నా ఆపగలరా అనిపించకమానదు.