పుష్ప 2 కి దేవిశ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే ఉంచి BGM కోసం మరో ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ అనుకున్న సమయానికి నేపధ్య సంగీతం ఇవ్వలేకపోవడంతో సుకుమార్ మరో ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని పుష్ప 2 కోసం తీసుకొచ్చారు. అందులో BGM కి బెస్ట్ అనే థమన్ కూడా ఉన్నారు.
అయితే నిన్న హైదరాబాద్ లో జరిగిన పుష్ప ద రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ఎలివేషన్ ఇస్తూ పుష్ప ద రూల్ హీరో ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది, దేవిశ్రీ BGM అదుర్స్ అన్నారు, అంతేకాకుండా సుకుమార్ మాట్లాడుతూ క్లైమాక్స్ లో దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ అంటూ హైప్ ఇచ్చారు.
మరి ఇదంతా దేవిశ్రీ చేసినప్పుడు థమన్, మిగతా ఇద్దరూ ఏ సన్నివేశాలకు నేపధ్య సంగీతం ఇచ్చారు, దేవినే అంతా కనిపిస్తే థమన్ ఎక్కడ ఉన్నారు అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.