పుష్ప ద రూల్ గురించి సోషల్ మీడియా లో కనిపిస్తున్న టాక్, పుష్ప 2 ప్రమోషన్స్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ జెలస్ ఫీలవుతున్నారు. ఆ జెలస్ తోనే దేవర నిర్మాత కళ్యాణ్ రామ్ ని సోషల్ మీడియా వేదికగా తెగ తిట్టిపోస్తున్నారు. దేవర చిత్రానికి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాని విడుదల చేసారు అంటూ తిడుతున్నారు.
పుష్ప పుష్ప అంటూ ఫ్యాన్స్, ప్రేక్షకులు కలవరిస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో గుబులు మొదలైంది. దానితో సోషల్ మీడియాలో గుడ్ నైట్ అన్న @NANDAMURIKALYAN … తొందరగా పడుకో కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వస్తాయ్ లేదంటే మేక్ అప్ మాన్ కి డబ్బులు బొక్కా అంటూ కళ్యాణ్ రామ్ పై సెన్సేషనల్ ట్వీట్స్ చేస్తున్నారు..
సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే ఎన్టీఆర్ ని అభిమానించే వాళ్లంతా దేవర కు ఒక్క ఈవెంట్ కూడా చెయ్యలేదు నిర్మాతలు, కానీ అల్లు అర్జున్ తన మేకర్స్ తో కలిసి పుష్ప ని ఆకాశంలో ప్రమోట్ చేసాడు. అందుకే సినిమాపై విపరీతమైన హై వచ్చేసింది అంటూ ఎన్టీఆర్ దేవర నిర్మాతలైన కళ్యాణ్ రామ్, యువ సుధా ఆర్ట్స్ వారిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.