బ్యాట్మెంటన్ ప్లేయర్ సింధు పెళ్ళికి సిద్దమైంది. ఎన్నో ఏళ్లుగా క్రీడారంగంలో అత్యున్నత అటకనబరిచి అవార్డులు, రివార్డులు అందుకున్న పీవీ సింధు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. హైదరాబాద్‌కు చెందిన టాప్ బిజినెస్ మ్యాన్ పాసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పీవీ సింధు పెళ్లాడనున్నట్లుగా ఆమె తండ్రి రమణ అనౌన్స్ చేసారు.
డిసెంబర్ 22 న సింధు-వెంకట దత్త సాయి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోట లో జరగనున్నట్లుగా సింధు తండ్రి రమణ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ నుంచే పెళ్లి మొదలవుతాయని, డిసెంబర్ 19 నాటికే సింధు ఫ్యామిలీ, వెంకట దత్త సాయి ఫ్యామిలీస్ ఉదయ్ పూర్ కి బయలుదేరనున్నట్లుగా తెలుస్తోంది.
పెళ్లి తరువాత కూడా పీవీ సింధు తన కెరీర్ ను కొనసాగించనుంది. పెళ్లి వేడుకలు ముగిసిన కొద్దిరోజుల్లోనే ఆమె నెక్స్ట్ సీజన్ కోసం సన్నద్ధమౌతారని సింధు ఫాదర్ పీవీ రమణ తెలిపారు.