మరికొన్ని గంటల్లో దూళిపాళ్ల నుంచి అక్కినేని గా మారబోతున్న శోభిత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజులుగా శోభిత దూళిపాళ్ల, నాగ చైతన్య ల హల్దీ సెర్మొనీ, మంగళ స్నానాలు, పెళ్లి కూతురుగా శోభితను ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ తయారు చేస్తున్న పిక్స్ అన్ని అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి.
శోభిత సిస్టర్ సమంత శోభిత మంగళ స్నానాల దగ్గర నుంచి పెళ్లి కూతురుగా శోభితను ముస్తాబు చేసేవరకు సందడి అంతా ఆమెదే కనిపిస్తుంది. తాజాగా శోభిత పెళ్లి కుమార్తెగా మారిన ఫొటోస్ నెట్టింట్లో సంచలనంగా మారాయి. రెడ్ శారీలో శోభితకు చీర పెట్టే దగ్గర నుంచి గాజులు తొడిగేవరకు, అలాగే నుదుటున కల్యాణ తిలకం ఇలా శోభిత పెళ్లి కూతురుగా చాలా సాంప్రదాయంగా కనిపించింది.
శోభిత అలాగే ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత పెళ్లి కూతురు ఫొటోస్ వైరల్ గా మారగా మరికొద్ది గంటల్లో చైతూ కి భార్యగా, నాగార్జునకు కోడలుగా అక్కినేని ఇంట కాలు పెట్టబోతోంది ఆమె.