బిగ్ బాస్ సీజన్ 8 లో 14 వ వారం నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఎక్కువమంది విష్ణు ప్రియని నామినేట్ చేశారు. నువ్వసలు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేకుండానే హౌస్ లో ఉన్నావ్ అంటూ గౌతమ్, అవినాష్ లు విష్ణు ప్రియను టార్గెట్ చెయ్యగా.. విష్ణు ప్రియా గౌతమ్ ని నామినేట్ చేసింది.
అయితే గౌతమ్ నిఖిల్ ని నామినేట్ చేస్తూ గొడవ కి దిగాడు, నిఖిల్ కూడా పృథ్వీ పేరు తీస్తూ గౌతమ్ పై అరిచేసాడు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న నువ్వు ఇప్పుడు రెచ్చిపోతున్నావ్ ఏది నిజం అన్నాడు గౌతమ్, లాస్ట్ నామినేషన్ నిన్ను, నీ ఆటను ఎక్స్ పోజ్ చెయ్యడానికే అంటూ నిఖిల్ అరిచేసాడు. దానితో గౌతమ్ నువ్వు యష్మి ని వాడుకున్నావ్ అంటూ నోరు జారాడు.
దానితో కోపమొచ్చిన నిఖిల్ గౌతమ్ పై సర్రున లేచాడు. ఏం మాట్లాడుతున్నావ్, నీ దగ్గర వినడాని రాలేదు, ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటది అంటూ నిఖిల్ గౌతమ్ కి ఇచ్చిన వార్నింగ్ ప్రోమో వైరల్ గా మారింది.